పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ విడిపోయిన తర్వాత ఆయన విదేశీ మహిళను మరో పెళ్లి చేసుకోవడం, ఆవిడ ద్వారా పిల్లల్ని కూడా కనడం తెలిసిందే. దాదాపు 8 సంవత్సరాల పాటు తన ఇద్దరు పిల్లల పెంపకంలో మునిగిపోయి పూణెలో ఒంటరిగా జీవితం గడుపుతున్న రేణు దేశాయ్.... పెద్దలు, ఫ్యామిలీ మెంబర్స్ సూచన మేరకు తన జీవితానికి కూడా ఒక మగ తోడు అవసరం అనే నిర్ణయానికి వచ్చి రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. ఆ నిర్ణయంతో రేణు దేశాయ్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరో పెళ్లి చేసుకుంటే అతడిని చంపేస్తామనపి కూడా కొందరు రేణు దేశాయ్‌ను బెదిరించారు. ఆ బెదిరింపులకు భయపడి తనకు కాబోయే భర్త వివరాలు బయటకు రాకుండా రహస్యంగా ఎంగేజ్మెంట్ వేడుక జరుపుకున్నారు. త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో రేణు దేశాయ్ తన చుట్టూ ఉన్న నెగెటివిటీని తగ్గించుకునేందుకు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
నేను గత సంవత్సరం రెండో పెళ్లి చేసుకుంటాననే నా ఆలోచన వ్యక్తం చేసినపుడు చాలా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. అతడిని చంపేస్తాం అని కొందరు దారుణంగా బెదిరించారు. అందుకే నా సెకండ్ మ్యారేజ్ విషయాలు, నాకు కబోయే భర్త వివరాలు రహస్యంగా ఉంచాను. ఆయనకు కూడా తన పేరు ముందే బయటకు రావడం ఆసక్తి లేదు.
"I am starting a new chapter of my life and I would like all the blessings and good wishes possible. This interview is not about Kalyan Garu or me talking negative about him. This interview is my letting go of my past and my closure. And I would take this opportunity to again sincerely thank everyone who have stood by me and given me the strength to believe that I have a chance at life again." Renu Desai said.
#renudesai
#pawankalyan