Faf du Plessis seeks clarity on ball-tampering rules

2018-07-08 20

The International Cricket Council recently made the ball-tampering punishment harsher for the offenders, extending the ban up to six Test matches or 12 one-day internationals.
#southafrica
#icc
#cricket
#fafduplessis

క్రికెట్‌లో బాల్ ట్యాంపరింగ్ ఓ పెద్ద కలకలం. ఈ మధ్య శ్రీలంక, ఆస్ట్రేలియా ఈ వివాదంలో చిక్కుకుని జట్టు క్రికెటర్లను నిషేదం కారణంగా కోల్పోయింది. దీంతో బాల్‌ ట్యాంపరింగ్‌ పాల్పడే క్రికెటర్ల పట్ల కఠినంగా వ్యవహరించేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) కొత్త రూల్స్‌ తీసుకొచ్చింది. ఈ తప్పిదానికి పాల్పడే వారు కనిష్టంగా ఆరు టెస్టులు లేదా 12 వన్డేల నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది.అలాగే 12 సస్పెన్షన్‌ పాయింట్లనూ విధిస్తూ ఐసీసీ నిబంధనల్ని సవరించింది. అయితే దీనిపై మరింత స్పష్టత కోరుతున్నాడు దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌. ఇప్పటి వరకూ ఉన్న నిబంధనలపై సందేహాలను వ్యక్తం చేస్తున్నాడు.