M S Dhoni Birthday : Wishes Poured By Cricketer

2018-07-07 16

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ శనివారం 37వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ధోనికి అభిమానులతో పాటు ప్రస్తుత మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ధోని పుట్టిన రోజును టీమిండియా క్రికెటర్లు ఘనంగా జరిపారు.
ఈసందర్భంగా పాండ్యా బ్రదర్స్‌ 'హ్యాపీ బర్త్‌డే మహీ' అంటూ పాడుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. భారత క్రికెట్‌కు ధోని విశేష సేవలందించాడు. బీసీసీఐ అందించిన అత్యుత్తమ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు.
ధోని తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. భారత క్రికెట్ జట్టు ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో పాలు పంచుకున్న ధోని.. భారత జట్టు తరపును 199 వన్డేలకు, 72 టీ20లకు, 60 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. వరల్డ్ కప్, వరల్డ్ టీ20, చాంపియన్స్ ట్రోఫీలను గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ధోని నిలిచాడు.

Wishes poured in for Mahendra Singh Dhoni as he turned 37 on Saturday (July 7). Dhoni is currently in England with India's limited over squad. India are facing England in a three-match T20I series which is currently locked at 1-1. Dhoni made his debut for India in 2004 in an ODI against Bangladesh and has played 318 matches so far.