Madhavi Latha Shocking Comments On Mahesh Kathi

2018-07-07 3,085

ఒకవేళ సీత రావణుడి దగ్గర ఉండి ఉంటే ఎంజాయ్ చేసేదేమో అని మహేష్ కత్తి చేసిన వ్యాఖ్యలపై సినీ నటి మాధవీలత మండిపడింది. కత్తి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా దుయ్యబట్టింది. ఒకవేళ ముస్లిం, క్రిస్టియన్, ఇతర మతాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే పరిస్థితి మారోలా ఉండేది అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఏమన్నారంటే.
తరాలు, యుగాలు మారినా ఇప్పటికీ మహాసాధ్వీ సీతమ్మనే భారతీయ మహిళలు స్ఫూర్తిగా తీసుకొంటారు. రావణుడి దగ్గర ఉండాలి అని అనడానికి వీడు (కత్తి మహేష్)ఎవడు అని మాధవీ లత ఫైర్ అయ్యారు. సీతమ్మ ఎక్కడ ఉండాలని నిర్ణయించడానికి వీడెవ్వడూ అని తీవ్రంగా స్పందించారు.
సాధారణంగా నేను టెలివిజన్ చర్చలో ఒకరిని వీడు, వాడు అని మాట్లాడను. కానీ మహేష్ కత్తి చేసిన వ్యాఖ్యల వల్ల వీడు అని మాట్లాడాల్సి వస్తున్నది. హిందు మతంలో ఉండే స్వేచ్ఛను అడ్డం పెట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవేళ వేరే మతంపై ఇలాంటి వాఖ్యలు చేస్తే ఫత్వా జారీ చేసేవారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు అని మాధవీ లత పేర్కొన్నారు.
మహేష్ కత్తి చేసే దుర్మార్గాలను భరించలేకనే ఆయన భార్య వదిలేసి వెళ్లింది. అలాంటి వ్యక్తి హిందు దేవుళ్లపై, సీతమ్మపై వ్యాఖ్యాలు చేస్తారా? రామాయణాన్ని కథగా భావిస్తే ఆయన వ్యక్తిగతం.. కానీ పబ్లిక్‌గా మాట్లాడటం సరికాదు. ఎన్నో తరాలు రామాయణాన్ని గౌరవిస్తూ వస్తుంటే ఇప్పుడు వీరు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నాడు.

Actress Madhavi Latha Comments directly On Mahesh Kathi. Presently facing charges making derogatory comments against Hindu god and godesses. Talking to media, She opposses kathi comments on goddess Sita. Madhavi Latha questions Kathi, talking about Hindu gods.