Sanju 1st Week Box Office Collections Report

2018-07-06 1,926

Ranbir Kapoor's Sanju based on the life story of Bollywood actor Sanjay Dutt continues its golden run at the box office. The Rajkumar Hirani directorial film has not only been winning hearts of the audience but also minting moolah at the box office. Breaking records at the box office, Sanju emerged to be the highest opener of the year and has now entered the coveted 200 crore club.Trade analyst Taran Adarsh tweeted, "#Sanju is 200 NOT OUT... Has an EXTRAORDINARY Week 1... Crosses *lifetime biz* of #3Idiots [₹ 202.47 cr] in 7 days... Fri 34.75 cr, Sat 38.60 cr, Sun 46.71 cr, Mon 25.35 cr, Tue 22.10 cr, Wed 18.90 cr, Thu 16.10 cr. Total: ₹ 202.51 cr.
రణబీర్ కపూర్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ 'సంజు' బాక్సాఫీసు వద్ద అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది.
రాజ్ కుమార్ హిరానీ చిత్రాలు ఎంత ప్రభావవంతంగా సినిమాలు చేయగలరో గతంలోనే రుజువైంది. గురువారంతో ఫస్ట్ వీక్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఒక్క ఇండియాలోనే రూ. 200 కోట్ల మార్కును అధిగమించింది. రణబీర్ కపూర్ కెరీర్లో ఇంత భారీ మొత్తం వసూలు చేసిన తొలి చిత్రంగా నిలిచింది. ఫస్ట్ వీకెండ్‌లోనే రూ. 100 కోట్లకు చేరువైన ఈ చిత్రం.... వీక్ డేస్‌లో కూడా ప్రేక్షకుల తాకిడి తగ్గక పోవడంతో వసూళ్ల వరద పారుతోంది.
ప్రముఖ సినీ వ్యాపార విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించిన వివరాల ప్రకారం.... ‘సంజు' మూవీ ఇండియాలో తొలి వారం రూ. 202.51 కోట్లు రాబట్టింది. తొలిరోజైన శుక్రవారం రూ. 34.75 కోట్లు, శనివారం 38.60 కోట్లు, ఆదివారం 46.71 కోట్లు, సోమవారం 25.35 కోట్లు, మంగలవారం 22.10 కోట్లు, బుధవారం 18.90 కోట్లు, గురువారం 16.10 కోట్లు రాబట్టింది.
రణబీర్ కపూర్ కెరీర్లోనే రూ. 200 కోట్లు వసూలు చేసిన చిత్రంగా ‘సంజు' నిలిచింది. గతంలో రణబీర్ నటించిన ‘యే జవానీ హై దివానీ' చిత్రం రూ. 188.57 వసూలు చేయగా ‘సంజు' దాన్ని అధిగమించింది.