RX 100 Movie Heroine Payal Rajput Hot Statements

2018-07-06 74

Ajay Bhupathi, a student of Ram Gopal Varma is making his directorial debut with RX 100 which is releasing this Friday. Starring Karthikeya and Payal, the film is an intense love story. This young director from Athreyapuram, West Godavari says that he always wanted to be a director even though he wasn’t aware what the work involved.
ఇటీవల కాలంలో యువ డైరెక్టర్ల చిత్రాలు ఎంత హంగామా చేస్తున్నాయో తెలిసిందే. పెళ్లిచూపులతో తరుణ్ భాస్కర్, అర్జున్‌రెడ్డితో సందీప్ వంగ, తొలిప్రేమతో వెంకీ అట్లూరి సెన్సేషనల్ విజయాలను సొంతం చేసుకొన్నారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి ప్రస్తుతం ఆర్ఎక్స్ 100 అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం రిలీజ్‌కు ముందే మంచి టాక్‌తో దూసుకెళ్తున్నది. విభిన్నమైన టైటిల్ పెట్టడానికి వెనుక ఆసక్తికరమైన విషయాలను దర్శకుడు అజయ్ భూపతి తెలుగు ఫిల్మ్‌బీట్‌కు వెల్లడించారు.
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో అనేక రకాలైన నేటివిటీలు ఉన్నాయి. వాటిపై సరిగా ఎవరూ దృష్టిపెట్టడం లేదు. పూర్తిస్థాయిలో నేటివిటి ఆధారంగా సినిమాను తెరకెక్కించాలని తొలి ప్రయత్నంలోనే బలంగా అనుకొన్నాను. గోదావరి జిల్లా నేటివిటితో పూర్తిస్థాయి ప్రేమకథను రూపొందించాను.
కథ రాసినప్పుడే యమాహా ఆర్ఎక్స్ 100 అనే టైటిల్ పెట్టాలని ఫిక్స్ అయ్యాను. హీరో, నిర్మాతకు కథ చెప్పినప్పుడు ఈ విషయాన్ని స్పష్టం చేశాను. ఆ తర్వాత లీగల్‌గా చిక్కులు వస్తాయేమోనని ఆలోచించి హైదరాబాద్‌లోని యమహా కంపెనీ ఉద్యోగులను సంప్రదించాం. పెద్దగా వారు పట్టించుకోలేదు. చివరికి చెన్నైలోని సౌత్ విభాగంతో చర్చించాం.