Srireddy Makes Controversial Comments On Mega Family

2018-07-06 1,727

Once again Srireddy makes controversial comments on Mega Family. Srireddy indirectly comments on Pawan Kalyan

వివాదాలతోనే శ్రీరెడ్డి సెలెబ్రెటీగా మారిపోయింది. ఆ మధ్యన కొన్ని మీడియా ఛానల్స్ లో, ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. కాస్టింగ్ కౌచ్ పోరాటం పేరుతో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి ఎక్కువగా మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేస్తోంది. తాజాగా శ్రీరెడ్డి మెగా ఫ్యామిలీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మెగా ఫ్యామిలిలో హీరోలు ఎక్కువవుతున్న విషయాన్ని సెటైరికల్ గా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ప్రస్తావించింది.
మెగా ఫ్యామిలిలో గుడ్లు ఇంకెన్ని పిల్లలవుతాయో. ఇప్పటికే తేనెపట్టులా కుప్పలు తెప్పలుగా అయిపోయి గందరగోళం చేస్తున్నారు. పిల్లలు అయిపోయి ఇప్పుడు అల్లుళ్ళు రంగంలోకి వచ్చారు అంటూ శ్రీరెడ్డి సెటైర్ వేసింది.
సినిమాల్లో ఇష్టం వచ్చినట్లు తినేస్తున్నారు. అవగాహనలేని వారంతా రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ కూడా తినేయండి అంటూ పరోక్షంగా శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ప్రస్తావించింది.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చే ఫ్రెష్ హీరోలకు మాత్రమే తన సపోర్ట్ ఉంటుందని శ్రీరెడ్డి తెలిపింది. చిత్ర పరిశ్రమలోని పెద్ద కుటుంబాలు ఫ్రెష్ హీరోల టాలెంట్ ని తొక్కేస్తున్నాయని శ్రీరెడ్డి పేర్కొంది.