Jos Buttler Wants England Keep Calm Come Back Hard In Second T20

2018-07-05 170

స్వదేశంలో టీమిండియాతో జరిగిన తొలి టీ20లో ఓటమిపాలైన ఇంగ్లాండ్... రెండో టీ20లో తప్పక రాణిస్తుందని ఆ జట్టు ఓపెనర్ జోస్ బట్లర్ ధీమా వ్యక్తం చేశాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన తొలి టీ20లో బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్, బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ రాణించడంతో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై కోహ్లీసేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
టోర్నీలో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టీ20 శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో జోస్ బట్లర్ మాట్లాడుతూ "సిరీస్‌లో ఒక మ్యాచ్‌ మాత్రమే ముగిసింది. అది కూడా టీ20 మ్యాచ్. మేము ఇంకా ఆత్మవిశ్వాసంతోనే ఉన్నాం. కచ్చితంగా రెండో టీ20 మ్యాచ్‌లో పుంజుకుని భారత్‌కి గట్టి పోటీనిచ్చి ఓడిస్తాం" అని అన్నాడు.

England skipper Eoin Morgan might have said that the team needs a way to tackle the Indian spinners, but opener Jos Buttler wants to stay calm and focus on the next game on Friday. He feels that it was just one game and there was no need to overthink or fret over the outcome of the opening T20I played at Old Trafford.
#india
#england
#josbuttler
#t20
#viratkohli
#Cricket