తేజ్ ఐ లవ్ యు ప్రీ రిలీజ్ ఈవెంట్

2018-07-05 1

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తేజ్ ఐ లవ్ యు చిత్రం జులై 6 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. కరుణాకరన్ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో చిత్రంపై అంచనాలు పెరిగాయి. సాయిధరమ్ తేజ్, మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో జంటగా నటించారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి క్లీన్ 'యు' సర్టిఫికెట్ జారీ చేశారు. కరుణాకరన్ శైలిలోనే ఈ చిత్రం కూడా ఉండబోతోంది.
వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న తేజుకు ఈ చిత్రం ఉపశమనం కలిగిస్తుందనే అంచనాలు ఉన్నాయి. తనదైన శైలిలో కరుణాకరన్ ప్రేమకథా మ్యాజిక్ చేయగలిగితే ఈ మెగా హీరో ఖాతాలో ఓ హిట్టు పడ్డట్లే.

Tej I Love You censor completed. The movie got Clean U certificate
#TejILoveYou