ఇటీవల కాలంలో కొన్ని మీడియా సంస్థల్లో ప్రజలకు అవసరమైన విషయాల కంటే కత్తి మహేష్, శ్రీరెడ్డి ఎక్కువగా కనిపిస్తున్నారు. వారు చేసి అనవసరమైన వ్యాఖ్యలని పెద్దవిచేసి చూపిస్తూ టిఆర్పి రేటింగుల కోసం వాడుకుంటున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. వీరిని హైలైట్ చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని వాదించేవారూ లేకపోలేదు. నిన్న మొన్నటివరకు శ్రీరెడ్డి వ్యవహారంతో పబ్బం గడుపుకున్న సదరు మీడియా సంస్థలు ప్రస్తుతం కత్తి మహేష్ ని ఉపయోగించుకుంటున్నారు. ఏకంగా శ్రీరామ చంద్రుడిపైనే దారుణమైన వ్యాఖ్యలు చేయిస్తూ డిబేట్లు పెట్టేస్తున్నారు. హిందూ సమాజం ఈ చర్యలపై భగ్గుమంటున్న తరుణంలో శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
ఫిల్మ్ క్రిటిక్ అని చెప్పుకునే కత్తి మహేష్ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి మీడియాలో ఫేమస్ అయ్యారు. ఆ తరువాత మహిళా సంఘాలు దారుణంగా వ్యతిరేకించిన వర్మ జీఎస్టీ చిత్రంపై ప్రశంసలు కురిపించాడు.
తాజాగా శ్రీరామ చంద్రుడినే దారుణంగా దూషించడం మొదలు పెట్టాడు. కత్తి మహేష్ చర్యలు అదుపు తప్పుడుతుండడంతో హిందూ సంఘాలు, రాజకీయ తీవ్రంగా ఖండిస్తున్నారు. అతడికి కావలసినంత ప్రచారాన్ని కల్పిస్తున్న కొన్ని మీడియా సంస్థలపై కూడా విమర్శలు అధికంఅవుతున్నాయి .
కత్తి వ్యవహారంపై మెగా బ్రదర్ నాగబాబు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు. హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే రాముడిపై వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. తడిని కఠినంగా శిక్షించాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులని నాగబాబు కోరారు.
Sensational comments on Kathi Mahesh from SriReddy twitter account. SriReddy reacts on this issue
#KathiMahesh
#SriReddy