Jana Sena chief Pawan Kalyan on Wednesday warned AP CM Nara Chandrababu Naidu in his Visakhapatnam Janasena Porata Yatra.
#PawanKalyan
#JanaSena
చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం హెచ్చరికలు జారీ చేశారు. ఖబడ్దార్, తమాషాగా ఉందా, పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే చూస్తూ కూర్చుంటానా అని ఊగిపోయారు. ఆయన విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గంలోని ముదుపాక సభలో మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు కూడా చట్టానికి అతీతులు కాదన్నారు. భూకబ్జాలు ఉండవద్దని, ఉత్తరాంధ్రకు అండగా ఉంటారని తాను టీడీపీకి మద్దతిచ్చానని చెప్పారు. దళితతేజం అని మాట్లాడే టీడీపీ ప్రభుత్వం వారి భూములు లాక్కుంటారని మండిపడ్డారు. సామాన్యుల భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకుంటామా అన్నారు.
విశాఖ రైల్వే జోన్‌కు అడ్డుపడిందే టీడీపీ ఎంపీలు రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్‌లు అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారన్నారు. ముదుపాకలో కనీసం ఓ డిగ్రీ కాలేజీ కూడా పెట్టలేకపోయారని విమర్శించారు. తాము జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పారు. పెందుర్తి నియోజకవర్గంలోనే ఎంతో భూమి లాక్కున్నారన్నారు. రైతులకు అండగా ఉంటామని చెప్పి, ఇప్పుడు దోచుకుంటారా అన్నారు.