1. వరంగల్ ఘోర ప్రమాదం: పోలీసుల అదుపులో భద్రకాలి పైర్ వర్క్స్ ఓనర్
2. ఎన్నికల వేళ: రైతులకు గుడ్ న్యూస్... కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
3. ఇంగ్లాండ్ గడ్డపై బోణీతో అదరగొట్టిన భారత్
1. వరంగల్ ఘోర ప్రమాదం: పోలీసుల అదుపులో భద్రకాలి పైర్ వర్క్స్ ఓనర్
కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్ వర్స్క్‌లో జరిగిన ప్రమాదం నేపథ్యంలో పోలీసులు బాణసంచా దుకాణ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. అనుమతులు లేకుండానే దీనిని నడిపిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని బాంబుల కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
2. ఎన్నికల వేళ: రైతులకు గుడ్ న్యూస్... కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో మోడీ సర్కార్ రైతులకు కానుక ఇచ్చింది. పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలో కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో వరి, ఖరీఫ్ పంటలకు సంబంధించిన మద్దతు ధరను పెంచుతూ కేబినెట్ నిర్ణయించింది. వరి సాధారణ గ్రేడ్‌కు కనీస మద్దతు ధర రూ.200 పెంచగా... అది ఇప్పుడు కొత్తగా క్వింటాల్ రూ. 1750కు చేరింది. గ్రేడ్ ఏ వెరైటీ పై రూ.160 పెంచింది. దీంతో అది కూడా రూ. 1750కు చేరింది.దీంతో ప్రభుత్వంపై ఏడాదికి రూ.1500 కోట్లు భారం పడనుంది.
3. ఇంగ్లాండ్ గడ్డపై బోణీతో అదరగొట్టిన భారత్
విదేశీ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్‌తో తొలి పోరులో తలపడిన కోహ్లీసేన శుభారంభాన్ని నమోదు చేసుకుంది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీసేన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ 8 వికెట్లు పడగొట్టి 158 పరుగులకు కట్టడి చేసింది. ఇందులో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీసి అదరగొట్టాడు. ఉమేశ్ యాదవ్ 2, పాండ్యా 1వికెట్ తీయగలిగారు.
4. భార్య, ప్రియుడు ఇంట్లో ఉండగా ఇంటికి తాళంవేసి నిప్పు,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. భార్య, ప్రియుడు కలిసి ఉండగా ఓ భర్త ఇంటికి నిప్పంటించాడు. ఈ ఘటనలో వారిద్దరు సజీవదహనం అయ్యారు. ఈ సంఘటన జిల్లాలోని ముత్తకూరు మండలం కోళ్లమిట్టలో జరిగింది. భార్య, ఆమె ప్రియుడు కలిసి ఇంట్లో ఉండటాన్ని గమనించిన భర్త తన ఇంటికి నిప్పు అంటించాడు.
Read and View all latest news headlines from India and around the world, get today's breaking news and live updates on politics, elections, business, sports, economy...
#news
#Oneindiatelugu
#Update
#Sports
#Movies