తమిళ తెలుగు భాషల్లో సూర్యకు మంచి క్రేజ్ ఉంది. విభిన్నమైన చిత్రాలతో సూర్య ఆడియన్స్ ని అలరిస్తున్నాడు.సూర్య మరో మరో భారీ చిత్రంలో నటిస్తున్నాడు. వీడోక్కడే, బ్రదర్స్, రంగం వంటి విభిన్న చిత్రాల దర్శకుడు కెవి ఆనంద్ దర్శకత్వంలో ప్రస్తుతం సూర్య నటిస్తున్నాడు. ఈ చిత్రంపై అభిమానుల్లో రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో మోహన్ లాల్, బోమన్ ఇరానీ వంటి నటులు నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ లో ప్రముఖ హీరో ఆర్య జాయిన్ అయ్యాడు.
కెవి ఆనంద్ దర్శకత్వంలో సూర్య నటించడం ఇది మూడవసారి. వీడోక్కడే, బ్రదర్స్ చిత్రాలు వీరి కాంబినేషన్ లో వచ్చినవే కావడం విశేషం. కెవి ఆనంద్ చిత్రాలు స్టైలిష్ గా సాగుతూ ఊహించని మలుపులతో ఉంటాయి.
ఈ చిత్రంలోప్రముఖ హీరో ఆర్య విలన్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్య తాజాగా ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఆర్యతో పాటు మోహన్ లాల్, బోమన్ ఇరానీ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు
2.0 చిత్ర నిర్మాణ సంస్థ సూర్య, కెవి ఆనంద్ చిత్రాన్ని నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధం అవుతున్నారు.
Suriya 37 is getting bigger by the day. Arya joins the cast and is likely to play the villain
#Suriya37