Ind VS ENG 1st T20: KL Rahul Hits Ton As India Beat England By 8 Wickets

2018-07-04 511

విదేశీ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్‌తో తొలి పోరులో తలపడిన కోహ్లీసేన శుభారంభాన్ని నమోదు చేసుకుంది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీసేన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ 8 వికెట్లు పడగొట్టి 158 పరుగులకు కట్టడి చేసింది. ఇందులో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీసి అదరగొట్టాడు. ఉమేశ్ యాదవ్ 2, పాండ్యా 1వికెట్ తీయగలిగారు.అనంతరం చేధనకు దిగిన భారత బ్యాట్స్‌మెన్ ఇంగ్లాండ్ బౌలర్లపై తమ సత్తా చాటారు. దీంతో పది బంతులు మిగిలి ఉండగానే.. ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. ఇంగ్లాండ్ పర్యటనలో ఇది శుభారంభం. ఓపెనర్లు ఇద్దరూ అవుటయిపోవడంతో.. మ్యాచ్ రాహుల్, కోహ్లీ చేతుల మీదుగా ముగిసింది. రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో రాణించి 54బంతుల్లోనే 101 పరుగులు (10 ఫోర్లు, 5 సిక్సులతో) సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ శర్మ అవుటయిపోవడంతో మరో ఎండ్‌లో బ్యాటింగ్ దిగిన కోహ్లీ 22 బంతుల్లో (20) పరుగులు చేసి విన్నింగ్ షాట్‌గా బంతిని సిక్సు బౌండరీకి పంపించాడు. ఇక ధావన్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే 4బంతులు ఆడి 4 పరుగులు మాత్రమే చేయగా... రోహిత్ 30బంతుల్లో 32 పరుగులు చేశాడు.

KL Rahul scored a scintillating 101 off 54 balls powering India to an 8-wicket win against England in the first T20I at Old Trafford on Wednesday. Scoring his second T20I hundred, Rahul whacked the English bowlers all over the park hitting 10 boundaries and 5 sixes. Chasing a target of 160 on a batting surface, India lost Shikhar Dhawan early. Rahul came in to bat at number three position and was middling the ball from the word go. Rahul clobbered all England bowlers to every corner of the ground.
#viratkohli
#teamindia
#shikhardhawan
#msdhoni
#rohitsharma
#hardikpandya
#eoinmorgan