The upcoming Jr NTR and Trivikram Srinivas combination film may be at the shooting stage, but pre-release business is already doing very well.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అరవింద సమేతపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అజాతవాసి ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని ఛాలెంజింగ్‌గా తెరకెక్కిస్తున్నట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే జై లవకుశ భారీ హిట్ తర్వాత మరో బ్లాక్‌బాస్టర్‌పై కన్నేశాడు తారక్. ఈ నేపథ్యంలో అరవింద సమేత చిత్రంపై రోజు రోజుకు అంచనాలు బీభత్సంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సినీ విమర్శకుడు ఉమెర్ సంధూ సెన్సేషనల్ ట్వీట్ చేశారు.
నాకు తెలిసిన కొందరు అరవింద సమేత రష్ ప్రింట్‌ను చూశారు. ఆ చిత్రం మైండ్ బ్లోయింగ్‌గా ఉందని చెప్పారు. యంగ్ టైగర్ గురించి మాటల్లో చెప్పలేం అని ఉమెర్ ట్వీట్ చేశారు.
అరవింద సమేత చిత్రంలో ఎన్టీఆర్ గెటప్ అదిరిపోయింది. కొత్త అవతారం టెర్రిఫిక్‌గా ఉన్నాడు. టాలీవుడ్‌కు మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ ఖాయమని తెలిసింది అని ఉమేర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు బ్రహ్మండమైన రెస్పాన్స్ వచ్చింది. సిక్స్‌ప్యాక్‌తో అదరగొట్టిన తారక్ సరికొత్తగా ఫ్యాన్స్‌కు కనువిందు చేశాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌గా వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ యాక్టింగ్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించడం ఖాయమంటున్నారు.