Director Harish Shankar Plans For New Movie With Mega Heroes

2018-07-03 635

Harish shankar multistarrer movie enter into Mega compound. Varun, Saidharam tej might be join hands for this movie
#Harishshankar


గబ్బర్ సింగ్ చిత్రంతో హరీష్ శంకర్ టాలీవుడ్ లో క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు. దువ్వాడ జగన్నాథం చిత్రం తరువాత హరీష్ శంకర్ ఓ మల్టీస్టారర్ చిత్రానికి ప్లాన్ చేశాడు. దిల్ రాజు నిర్మాణంలోనే ఈ చిత్రం తెరకెక్కబోతోంది. కానీ ఈ చిత్రానికి హీరోల సమస్య వేధిస్తున్నట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, డీజే వంటి హిట్ చిత్రాలని ఈ దర్శకుడు మెగా హీరోలకు అందించాడు. త్వరలో తాను తెరక్కించబోయే మల్టీస్టారర్ చిత్రం కోసం కూడా హరీష్ శంకర్ మెగా హీరోలనే నమ్ముకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆడియన్స్ కు కావలసినంత ఎంటర్ టైన్ మెంట్ అందించడంలో హరీష్ శంకర్ సిద్ధహస్తుడు. ఆయన చిత్రాలలో పుష్కలంగా వినోదం ఉంటుంది. హరీష్ శంకర్ తెరక్కించబోయే మల్టీస్టారర్ చిత్రానికి దాగుడు మూతలు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటగా ఈ చిత్రానికి హీరోలుగా నితిన్, శర్వానంద్ పేర్లు వినిపించాయి. నితిన్ కూడా ఈ చిత్రం చేయబోతున్నట్లు ఓ సందర్భంలో స్పందించాడు.కానీ ఈ చిత్రం నుంచి వీరు తప్పుకున్నట్లు తెలుస్తోంది.