Sanju Movie About To Break All Records

2018-07-03 457

Ranbir Kapoor's Sanju is on a record-breaking spree. The film based on the life story of Bollywood actor Sanjay Dutt has received a thumbs up from both, the critics and audience alike.

రణబీర్ కపూర్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన బయోపిక్ 'సంజు' బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఇటు సినీ క్రిటిక్స్ నుండి ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తొలి మూడు రోజుల్లో(ఫస్ట్ వీకెండ్) రూ. 120 కోట్లకుపైగా వసూలవ్వగా, నాలుగో రోజైన సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ వసూళ్లు అదరగొట్టింది. దీంతో ఇండియా మార్కెట్లో 'సంజు' వసూళ్లు రూ. 150 కోట్లకు చేరువయ్యాయి.
తొలి నాలుగు రోజుల్లో ‘సంజు' మూవీ రూ. 145.41 కోట్లు రాబట్టిందని, సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడరు.
‘సంజు' కలెక్షన్ల జోరు చూస్తుంటే.... తొలివారం వసూళ్లు రూ. 200 కోట్లను రీచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన ‘పికె' అతడి కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అదే విధంగా బాలీవుడ్లో బాహుబలి-2(హిందీ) తర్వాత హయ్యెస్ట్ గ్రాసర్‌గా ‘దంగల్' సినిమా ఉంది. ఈ రెండు రికార్డులను ‘సంజు' అధిగమిస్తుందని భావిస్తున్నారు. రెండో వారంలో వచ్చే వసూళ్లను బట్టి ఈ విషయంలో ఓ క్లారిటీ రానుంది.