ఈ నగరానికి ఏమైంది? సినిమా సక్సెస్ మీట్

2018-07-03 2,015

Ee Nagariniki Emaindhi movie is a romantic entertainer directed by Tharun Bhascker and produced by Suresh Babu under Suresh Productions banner while Vivek Sagar scored music for this movie


పెళ్లి చూపులు' ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో కొత్త నటీనటులతో తెరకెక్కిన చిత్రం 'ఈ నగరానికి ఏమైంది?'. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థ ఈచిత్రాన్ని నిర్మించడం, తరుణ్ భాస్కర్ గత సినిమా మంచి హిట్ కావడంతో 'ఈ నగరానికి ఏమైంది?'పై ముందు నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా విడుదలైన తర్వాత రెస్పాన్స్ కూడా సంతృప్తి కరంగానే ఉంది. అయితే ఈ సినిమాకు వచ్చిన కొన్ని రివ్యూలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తరుణ్ భాస్కర్ పోట్టిన పోస్ట్ వివాదాస్పదం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో తరుణ్ భాస్కర్ వివరణ ఇచ్చారు.
కొందరు పెళ్లి చూపులు లాగా ఉందా? అనే సందేహంలో ఉన్నారు. కానీ ఇది పెళ్లి చూపులు కంటే డిఫరెంట్ ఫిల్మ్. దానికి దీనికి ఎక్కడా కంపారిజన్ లేదు. సినిమాలో ఎక్కడా వల్గారిటీ లేదు. ఆల్కహాల్ గురించి కొన్ని సీన్లు ఉన్నా కానీ ఈ జనరేషన్ గురించి చెప్పే సీన్లు అవి. సినిమా చూసిన తర్వాత ఈ తరం మనుషుల గురించి మీరు ఆలోచిస్తారు. అదే విధంగా మీ పాత జ్ఞాపకాలు మీకు గుర్తుకు వస్తాయని నమ్ముతున్నాను... అన్ని తరుణ్ వ్యాఖ్యానించారు.