పోలీసుల అదుపులో కత్తి మహేశ్‌

2018-07-03 1,349

హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీరాముడిపై సినీ క్రిటిక్ కత్తి మహేశ్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు హిందుత్వ సంఘాలు పోలీసులకు కత్తిపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ వ్యవహారంపై స్వామి పరిపూర్ణానంద మీడియాతో మాట్లాడుతూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు! " కత్తి మహేశ్ ఈ రోజు నుంచి బయట తిరగలేడు. కత్తిని కఠినంగా శిక్షించాలి. మంచి తనాన్ని చేతకాని తనంగా తీసుకోకూడదు. హిందువుల ఆరాధ్యుడైన రాముడిని తిట్టడం మంచిది కాదు. మా గ్రంథాలను డిఫెన్ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. కత్తి విషయంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని వార్నింగ్ ఇచ్చారు.
"కత్తి మహేశ్ కోట్లాది మనసులను గాయపరిచాడు.. కచ్చితంగా మేమందరం రోడ్డెక్కుతాం. మాకు మంగళవారం లోగా ప్రభుత్వం స్పందించకపోతే మేం రోడ్డెక్కుతాం. ఆయన ఎక్కడ్నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాంటున్నాడు.. ఆయనకు ఏ నాయకుడు స్థానమిస్తాడో అదీ చూద్దాం.. ఎప్పుడో నిలబడటం కాదు.. ఇప్పుడు నిలబడు చూద్దాం. కేసులు పెట్టాం.. పోలీసులకు 24గంటలు టైమిస్తున్నాం..పోలీసులు చేతులుకట్టుకుని కూర్చోరని నేను నమ్ముతున్నాను. వాళ్లు కూడా స్పందిస్తారని అనుకుంటున్నా. పోలీసులు స్పందించని పక్షంలో ఆ తర్వాత మేమేంటో చూపిస్తాం.. మేమేం చేతులు కట్టుకుని దద్దమ్మల్లాగా ఉండం.. మా రాముడు ఎంత శాంతం వహించారో మీ అందరికీ తెలుసు. కత్తి మహేశ్ ఒక వానపాము" అని పరిపూర్ణానంద చెప్పుకొచ్చారు.

Videos similaires