Malaysia Open 2018: PV Sindhu Loses To Tai Tzu Ying, Indian Challenge Over

2018-06-30 740

India's top shuttlers P V Sindhu and Kidambi Srikanth went down fighting in their respective women's and men's singles semifinals to draw the curtains on the team's campaign at the USD 700,000 Malaysia Open Super World Tour 750 tournament in Kuala Lumpur on Saturday. First, Srikanth failed to match the overall superior game of former world no 2 Japanese Kento Momota.
#malaysiaopen2018
#badminton
#pvsindhu
#taitzuying
#kidambisrikanth

మలేసియా ఓపెన్‌లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. సెమీస్‌ చేరి ఆశలు రేకెత్తించిన తెలుగు తేజాలు కిదాంబి శ్రీకాంత్‌, పీవీ సింధులు నిరాశపరిచారు. ఇద్దర్లో ఒక్కరు కూడా ఫైనల్‌కు చేరలేకపోయారు. దీంతో భారత్‌ పోరు ముగిసినట్లైంది. శనివారం​ జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్లో భారత షట్లర్‌ పీవీ సింధు 15-21, 21-19, 11-21 తేడాతో ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓటమి పాలైంది.
ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ ప్లేయర్ సింధు చాలా ఇబ్బందులు పడింది. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో.. ఫస్ట్ గేమ్‌ను తాయ్ తన ఖాతాలో వేసుకుంది. ఇక సెకండ్ గేమ్‌లో సింధు తన సత్తాను చూపాల్సి వచ్చింది. అతికష్టంగానే ఆమె సెకండ్ గేమ్‌ను గెలుచుకుంది. దీంతో నిర్ణయాత్మక మూడవ గేమ్ ఆసక్తిని రేపింది. కానీ డిసైడింగ్ గేమ్‌లో సింధు సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు. సింధు పదేపదే పొరపాట్లు చేసింది. తైపి ప్లేయర్ అతి సునాయాసంగా గేమ్‌ను గెలుచుకుంది. తైపి ప్లేయర్ చాకచక్యంగా షాట్లు కొడుతూ సింధును ముప్పుతిప్పలు పెట్టింది.