Siddharth Kaul ecstatic to receive his maiden India cap from MS Dhoni

2018-06-30 328

Punjab pacer Siddharth Kaul made his debut for India in the second T20I against Ireland at The Village in Malahide, Dublin on Friday (June 29). The 75th T20I player for India, Kaul, received his maiden India cap from the legendary MS Dhoni prior to the toss.
#siddarthkaul
#india
#msdhoni
#viratkohli
#cricket
#teamindia


ఏం చేసినా పరవాలేదు గ్రౌండ్‌లో కనిపించాలంతే.. అనుకునే ఆటగాళ్ల చాలా అరుదు. ఇలాగే, గతేడాది భారత్‌ వేదికగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ జరిగిన సమయంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గాయం కారణంగా ఓ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత మ్యాచ్‌లో కోహ్లీ మైదానంలో ఉన్న సహచర ఆటగాళ్లకు డ్రింక్స్‌ అందజేస్తూ కనిపించాడు. తాజాగా భారత్‌-ఐర్లాండ్‌ మధ్య శుక్రవారం జరిగిన రెండో టీ20లో కూడా ఇలాంటి సన్నివేశమే కనిపించింది.
అప్పుడు కోహ్లీ చేస్తే.. ఇప్పుడు మహేంద్ర సింగ్‌ ధోనీ సహచర ఆటగాళ్ల కోసం డ్రింక్స్‌, కిట్‌ బ్యాగ్‌లను మోసుకెళ్లాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ నాలుగు మార్పులు చేశాడు. ధోనీ, ధావన్‌, భువనేశ్వర్‌, బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చి.. రాహుల్‌, దినేశ్‌కార్తీక్‌, ఉమేశ్‌ యాదవ్‌, సిద్దార్థ్‌ కౌల్‌లను తుది జట్టులోకి తీసుకున్నాడు.