The much-awaited movie of the year, Rajkumar Hirani's Sanju, has hit the theatres and the movie has taken the audience and critics by storm! Everyone has only good things to say about the movie hence, it won't be surprising if Sanju becomes the highest grosser film of Ranbir Kapoor's career or the year 2018.
అటు క్రిటిక్స్ నుండి, ఇటు కామన్ ఆడియన్స్ నుండి సినిమా మైండ్ బ్లోయింగ్ అనే కామెంట్స్ వినిపించాయి. ఈ మూవీకి వస్తున్న స్పందన చూస్తుంటే ఫుల్ రన్‌లో రణబీర్ కపూర్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమా నిలవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.
రణబీర్ కపూర్‌కు గడిచిన ఐదేళ్లలో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేదు. అతడి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ 'యే జవానీ హై దివానీ'... 2013లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో రూ. 188 కోట్లు వసూలు చేసింది. మరి రణబీర్ కపూర్ కెరీర్లో 'సంజు' మరో భారీ బ్లాక్ బస్టర్‌గా నిలవబోతోందా? అనేది త్వరలోనే తేలనుంది. ఈ సినిమాకు సంబంధించిన ఎస్టిమేటెడ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.
ట్రేడ్ వర్గాల ఎర్లీ ఎస్టిమేషన్స్ ప్రకారంఈ చిత్రం తొలి రోజు రూ. 40 కోట్ల వరకు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. మరికొన్ని గంటల్లో కలెక్షన్స్‌కు సంబంధించి క్లియర్ నెంబర్స్ వెల్లడికానున్నాయి.
రణబీర్ కపూర్ కెరీర్ పరిశీలిస్తే చాలా కాలంగా అతడికి సరైన హిట్స్ లేవు. ‘సంజు' మూవీ రణబీర్ కు తప్పకుండా కెరీర్ టర్నింగ్ మూవీ అవుతుందని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ నటన అందరినీ కట్టిపడేసింది.