Serena Williams Embroiled Controversy Over Doping Test At Her Home

2018-06-29 117

Serena Williams has complained of excessive dope-testing demands after a tester working for Usada visited her in Florida outside her specified “whereabouts" window and found her not at home.
#serenawilliams
#tennis
#Doping
#Wimbledon
#Press
#News

తాజాగా వింబుల్డన్ సీడింగ్ దక్కించుకున్న అమెరికా అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారిణి సెరెనా డోపింగ్ పరీక్షకు అందుబాటులో లేకుండాపోయింది. ఈ పరీక్ష కోసం నమూనాలు సేకరిద్దామని సెరెనా ఇంటికి వెళ్లిన వైద్యధికారులకు నిరాశే ఎదురైంది. ఆమె ఇంట్లో లేకపోవడంతో వారు శాంపిల్స్‌ తీసుకోకుండానే వెనుదిరిగారు. దీనికి సంబంధించిన కథనం స్థానిక పత్రికలో వెలువడింది. దీనిపై యూఎస్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ(యూఎస్‌ఏడీఏ) స్పందించింది. నిబంధనలకు వ్యతిరేకంగా తాము ఏమీ చేయడంలేదని స్పష్టం చేసింది.
గత ఏడాది బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం సెరెనా ఇటీవల ఫ్రెంచ్‌ ఓపెన్‌తో ఆటలోకి పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వింబుల్డన్‌లో కూడా సెరెనాకు సీడింగ్‌ దక్కింది. ప్రపంచ 183వ ర్యాంకులో ఉన్న ఆమెకు నిర్వాహకులు 25వ సీడింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉండగా జూన్‌ 14న ఉదయం 8.30గంటల సమయంలో యూఎస్‌ఏడీఏకు చెందిన వైద్యులు ఫ్లోరిడాలోని సెరెనా విలియమ్స్‌ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో సెరెనా ఇంట్లో లేదు. ఆమె వచ్చేంత వరకూ ఉండి నమూనాలు తీసుకొనే వెళ్లాలనుకున్నారు. కానీ, ఆమె ఎంతసేపటికీ రాకపోవడంతో చేసేదేమీ లేక వారు తిరిగి వెళ్లిపోయారు.