Comedian Shakalaka Shankar decided to try out his luck as the male lead in films. He is reportedly making his lead debut in the film ‘Shambho Shankara’ to be directed by newcomer N Sreedhar. Ramana Reddy and Suresh Kondeti are producing the film under SK Pictures banner. This movie lyrical song released by VV Vinayak. Recently director Harish Shankar releases Shambo Shankara teaser and made sensational comments on Shakalaka Shankar.
గీతాంజలి, రాజుగారి గది, ఆనందోబ్రహ్మ లాంటి చిత్రాల్లో కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకొన్న షకలక శంకర్ మరో అడుగు ముందుకు వేసి శంభో శంకర చిత్రంతో హీరోగా మారారు. డైరెక్టర్ శ్రీధర్ రూపొందించిన ఈ చిత్రానికి నిర్మాతలుగా రమణారెడ్డి, సురేష్ కొండేటి వ్యవహరించారు. శంకర్ సరసన కారుణ్య చౌదరి నటించారు. రైతులు, ఇతర సమస్యలను ఆధారంగా చేసుకొని రూపొందించిన ఈ చిత్రం జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమెడియన్ ప్రేక్షకులను ఇప్పటికే మెప్పించిన శకలక శంకర్ హీరోగా ఏ విధమైన రెస్పాన్స్‌ను సంపాదించుకొన్నారో తెలుసుకోవాలంటే శంభో శంకర్ చిత్ర కథలోకి వెళ్లాల్సిందే.
శంకర్ (షకలక శంకర్) నిజాయితీ కల యువకుడు. ఎస్సై ఉద్యోగం చేసి సమాజాన్ని ఉద్దరించాలనే తలంపుతో ఉంటాడు. అంతేకాకుండా ఊరి జమీందార్ ఆగడాలను ఎదురిస్తుంటాడు. ఎస్సై ఉద్యోగం కోసం వెళితే చేదు అనుభవం ఎదురవుతుంది. ఈ క్రమంలో తన చెల్లెలు దారుణ హత్యకు గురి అవుతుంది. తన చెల్లెలి మరణానికి కారణమైన జమీందార్ అంతు చూస్తానని హెచ్చరిస్తాడు. శంకర్‌లోని తెగువను చూసి జిల్లా ఎస్పీ స్వయంగా ప్రత్యేక అధికారాలు ఇస్తాడు.
ఎస్పీ ఇచ్చిన ప్రత్యేక అధికారాలతో శంకర్ ఏం చేశాడు? శంకర్ చెల్లి మరణానికి కారణం ఏమిటి? జమీందార్ ఆగడాలకు అంతం ఎలా పలికాడు? ఊరి కోసం సొంత అన్న చేసే అక్రమాలను ఎలా ఎదుర్కొన్నాడు. తనను ఇష్టంగా ప్రేమించే ప్రియురాలితో కలిసి ఆటపాటలతో ఎలా అలరించాడు. ఊరిలోని సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపారన్న ప్రశ్నలకు తెర మీద శంకర్ చేసిన మ్యాజిక్ ఈ చిత్ర కథ