Aravinda Sametha Movie Team Is Expecting Huge pre release business

2018-06-29 816

Huge pre release business is expecting for Aravinda Sametha movie. Trivikram Srinivas directing this movie first time with NTR

ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న అరవింద సమేత చిత్రంపై భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. వీరి కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ఇది. బలమైన యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హారిక అండ్ హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. భారీ నెలకొన్న అంచనాలతో ప్రీరిలీజ్ బిజినెస్ కూడా అదేస్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. తాజగా అరవింద సమేత ప్రీరిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
అరవింద సమేత చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం 80 కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ ఇటీవల వరుసగా విజయాలు సాధిస్తుండడం కూడా అరవింద సమేత చిత్రానికి కలసివచ్చే అంశం. ఎన్టీఆర్ చివరగా నటించిన జై లవకుశ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.