Sanju First Review ‘సంజు’ మూవీ ఫస్ట్ రివ్యూ

2018-06-28 8

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితంలో లెక్కలేనన్ని వివాదాలు, ఎన్నో ఆసక్తికర అంశాలు, దిగ్భ్రాంతికర సంఘటనలు. వాటికి తెరరూపం కల్పంచారు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ. రణబీర్ కపూర్ సంజయ్ దత్ పాత్రలో నటించిన ఈ చిత్రం జూన్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
శుక్రవారం ఈ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో బుధవరాం రాత్రి రాజ్ కుమార్ హిరానీ తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులకు స్పెషల్ షో వేశారు. సినిమా చూసిన అనంతరం పలువురు తమ అభిప్రాయాలు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వారి కామెంట్స్ బట్టి చూస్తే సినిమా అదిరిపోయే విధంగా ఉందని స్పష్టమవుతోంది. వారి కామెంట్లపై ఓ లుక్కేద్దాం.
‘సంజు' మూవీ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. కమ్లి పాత్రలో విక్కీ కౌశల్, సునీల్ దత్ పాత్రలో పరేష్ రావల్ మరిచిపోలేని విధంగా ఉంది. రణబీర్ కపూర్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.
ఒకే సీన్లో నవ్వించడంతో పాటు ఏడిపించే చిత్రం మాస్టర్ పీస్ మూవీ అవుతుంది. సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌ను మీరు ప్రేమిస్తారు. బోమన్ ఇరానీ పాత్ర మీకు నవ్వు తెప్పిస్తుంది. జిమ్ శరబ్ పాత్రను మీరే హేట్ చేస్తారు.
ఈ సినిమా చూసిన బిజేపీ నేత మోహిత్ కాంబోజ్ రియాక్ట్ అవుతూ.... రాజ్ కుమార్ హిరానీకి బెస్ట్ విషెస్ తెలిపారు. రణబీర్ కపూర్, ఇతర తారాగణం అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారని, సంజయ్ దత్ జీవితాన్ని తెరపై ఎంతో చక్కగా చూపించారు.
మిస్ ఇండియా 1979 స్వరూప్ స్పందిస్తూ... రణబీర్ కపూర్, పరేష్ రావల్, విక్కీ కౌశల్ నటనకు మంత్రముగ్ధులమైపోయాము. రాజ్ కుమార్ హిరానీ అద్భుతమైన స్టోరీ టెల్లర్ అని ట్వీట్ చేశారు.
సినిమా డిస్ట్రిబ్యూటర్ అభిమన్యు స్పందిస్తూ... ఇదొక అద్భుతమైన సినిమా, సంజయ్ దత్ పాత్రలో రణబీర్ కపూర్ అదరగొట్టారు. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ ఔట్ స్టాండింగ్ అని ట్వీట్ చేశారు.