Ram Charan spends 40 cr for 1 Scene In Sye Raa. Chiru working till 3am at sets
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహా రెడ్డి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రానికి నిర్మాత. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అబ్బురపరిచే విధంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
సైరా చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలనే ఆలోచనలో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. 60 ఏళ్ల వయసులో కూడా చిరు ఎంతో ఉత్సాహంగా షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం.
ప్రస్తుతం హైదరాబాద్ శివారులో సైరా షూటింగ్ జరుగుతోంది. యుద్ధ సన్నివేశాలని దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. తెల్లవారు జాము 3 గంటలవరకు కూడా షూటింగ్ కొనసాగుతోంది. అయినప్పటికీ మెగాస్టార్ చిరు చాలా ఎనర్జిటిక్ గా షూటింగ్ లో పాల్గొంటున్నారు. మెగాస్టార్ ఎనర్జీతో చిత్ర యూనిట్ మొత్తం ఆశ్చర్యపోతున్నారు.
యుద్ధ సన్నివేసాల కోసం ప్రత్యేకమైన సెట్స్ నిర్మించారు. ప్రస్తుతం జరుగుతున్న వార్ ఎపిసోడ్స్ కి రాంచరణ్ ఏకంగా 40 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. సైరా ఏస్థాయిలో నిర్మించబడుతోందో అని.