చిన్న బాబు ఆడియో లాంచ్ లో హీరో సూర్య స్పీచ్

2018-06-27 1

Suriya and Karthi Superb Speech at Chinna Babu Audio Launch. Chinna Babu is an upcoming 2018 Indian Telugu language comedy drama film written and directed by Pandiraj and produced by Suriya for, his studio 2D Entertainment.

కార్తీ, సయేషా హీరో హీరోయిన్లుగా పాండిరాజ్ దర్శకత్వంలో తెరక్కిన చిత్రం "చినబాబు". ఈ చిత్రాన్ని కార్తి సోదరుడు, ప్రముఖ సౌత్ హీరో సూర్య తన సొంత బేనర్ 2డి ఎంటర్టైన్మెంట్స్‌పై నిర్మించారు. ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ ఎలిమెంట్స్ కలగలిపి తెరకెక్కించిన ఈ చిత్రంలో కార్తి రైతు పాత్రలో కనపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా ప్రమోషన్లో భాగంగా వైజాగ్‌లో ఆడియో రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. తమిళంలో కడైకుట్టి సింగం పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో 'చినబాబు' పేరుతో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్లో మిరియాల రవీందర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. "రైతును మర్చిపోతున్న సమయంలో రైతును గుర్తుచేసుకొనే విధంగా సినిమా చెయ్యడం గర్వంగా ఉంది. అన్నయ్య సూర్య ఈ సినిమా చూసి మెచ్చుకోవడం జరిగింది. జులై లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందరు కలిసి ఉండాలని చెప్పే సినిమా ఇది. ఈ సినిమా చూశాక మీరు మీ అన్నా, తమ్ముడు, అక్కా, చెల్లికి ఫోన్ చేసి మాట్లాడుతారు" అని కార్తి తెలిపారు. చినబాబు సినిమాపై తమిళ్ లో ఎంతటి అంచనాలు ఉన్నాయో తెలుగులో అంతే అంచనాలు ఉన్నాయి. సూర్య, కార్తీ ఈ స్క్రిప్ట్ ఓకే చెయ్యడంతోనే ఈ సినిమా సగం సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో యాక్షన్, ఫ్యామిలీ, లవ్ ఉన్నాయి. అందరికి నచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతోంది.