Shakalaka Shankar inteesting speech at Shambho Shankara Pre release. Jabardasth fame actor Shakalaka Shankar is coming before the audience with this movie as a lead hero.
జబర్దస్త్ కామెడీ షోతో పాపులారిటీ సంపాదించిన కొద్దిమందిలో షకలక శంకర్ ఒకరు. తక్కువ సమయంలో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న షకలక శంకర్ హీరోగా శంబో శంకర సినిమా రూపొందుతోంది.. ఇటీవలే ఈ మూవీ ఫ్రీ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. . పవర్ ఆఫ్ శంకరా అంటూ బ్యాక్ డ్రాప్ లో ఒక టెంపుల్, త్రిశూలం ఈ ప్రీ లుక్ ఫోటోలో ఉన్నాయి. పోస్టర్ కు మంచి రెస్పాన్స్ లభించడం జరిగింది. శంకర్ ని హీరోగా, శ్రీధర్ ఎన్. దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్. ఆర్. పిక్చర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చర్స్ సమర్పణలో వై. రమణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తోన్న శంభో శంకర. ఈ సందర్భం గా నిర్మాత సురేశ్ కొండేటి మాట్లాడుతూ - `` మంచి సబ్జెక్ట్‌తో శంకర్ , డైరెక్టర్ శ్రీధర్ నా దగ్గరకు వచ్చారు. కథ వినగానే నచ్చడంతో ఈ సినిమా నిర్మాణంలో నేను కూడా పార్ట్ అయ్యాను. శంకర్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమానే కాకుండా తను మరో పది సినిమాలు చేస్తాడనే నమ్మకం నాకుంది. నేనే తనతో రెండు, మూడు సినిమాలు చేసే అవకాశం ఉంది. మంచి బ్లాక్ బస్టర్ సినిమా చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను నిర్మించాను`` అన్నారు.