Krishnam Raju Opens About Prabhas's Marriage

2018-06-27 1,910

Krishnam Raju opens about Prabhas's marriage again. Krishnam Raju makes interesting comments this time

ప్రభాస్ ఇండియాలో మోస్ట్ ఎలిజబుల్ బాచులర్స్ లో ఒకడు. అందులో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పెళ్లి గురించి కూడా అభిమానుల్లో చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ప్రభాస్ పెళ్లి విషయం గురించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిలో ఎలాంటి వాస్తవం లేదని తేలిపోయిది. తాజగా ఓ ఇంటర్వ్యూలో కృష్ణం రాజు పెళ్లి గురించి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
ప్రభాస్ ని పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా త్వరలో చేసుకుంటా అనే సమాధానం వచ్చేదని కృష్ణం రాజు అన్నారు. మీడియా ప్రశ్నకు కూడా ప్రభాస్ ఇదేరకమైన సమాధానం ఇచ్చాడు. బాహుబలి చిత్రంతోనే ప్రభాస్ కు దాదాపు 3 ఏళ్ళు గడచిపోయింది.
ప్రభాస్ కు పెళ్లి చేసుకోవాల్సిన వయసు వచ్చింది. అతడేం చిన్నపిల్లవాడు కాదు. ఈ విషయం గురించి అతడే నిర్ణయం తీసుకోవాలి అని కృష్ణం రాజు అన్నారు. ఈ వ్యాఖ్యలని బట్టి ప్రభాస్ సమీప భవిష్యత్తులో వివాహం చేసుకునేలా కనిపించడం లేదు.