FIFA World Cup 2018 : Peru Wins On Australia With 2-0

2018-06-27 96

As the minutes ticked away so too did Australia's hopes of a turnaround; Aziz Behich got in behind the Peru defence and had time and space to pick his spot but instead opted to send a cross beyond the unmarked Cahill.

ఫిఫా ప్రపంచ కప్ లో భాగంగా రొస్తోవ్ ఆన్‌డాన్ వేదికగా గ్రూప్-సీ జట్లు ఆస్ట్రేలియా, పెరూ మంగళవారం తలపడ్డాయి. నాకౌట్ బెర్తుకు ఆస్ట్రేలియా అర్హత సాధించాలంటే పెరూపై గెలవాల్సి ఉంది. అది కూడా మరో మ్యాచ్ ఫలితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. గోల్ తేడాను బట్టి బెర్తు ఖరారవుతుంది. కనీస పోరాట పటిమ కనబర్చక, పేలవ ప్రదర్శనతో పెరూ చేతిలో 2-0తో ఆస్ట్రేలియా ఓటమి పాలవడంతో ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో పెరూ ఒక్కదాంట్లో గెలవగా.. ఆస్ట్రేలియా ఒక్క డ్రాతో సరిపెట్టుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్న పెరూ.. తమ లీగ్ ఆఖరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చి.. విజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
1978 నుంచి వరల్డ్ కప్ టోర్నీలో ఆడుతున్న పెరూ ఒక్కసారి కూడా ఫైనల్ వరకూ చేరలేకపోయింది. కాగా, దాదాపు 40 వేల మంది పెరూ దేశస్థులు ప్రపంచ కప్ మ్యాచ్ చూసేందుకు రష్యా చేరుకుని ప్రపంచ కప్ ను ఆస్వాదిస్తున్నారు. ప్రపంచ కప్ చరిత్రలో 1978లో మాత్రమే ఇరాన్ తో ఆడిన పెరూ ఒకే ఒక్క ఆరంభ మ్యాచ్ గెలుచుకుంది. ఇక ఆస్ట్రేలియా విషయానికొస్తే, ఇప్పటి వరకూ 16 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లు ఆడి రెండు సార్లు మాత్రమే గెలుచుకుంది.