Harish Shankar to direct Kalyaan Dhev. Interesting devolopment on Chiru son in law's next movie
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న విజేత చిత్రం జులై 6 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజేత చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. ఫస్ట్ లుక్ మొదలుకుని టీజర్, పాటలు, ట్రైలర్ అన్ని ఆడియన్స్ ని ఆకట్టుకునేవిగా ఉన్నాయి. విజేత చిత్రంలో తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ అంశాలతో పటు రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా చూపించబోతున్నారు. తొలి ప్రయత్నంలోనే నటుడిగా కళ్యాణ్ దేవ్ కు మంచి మార్కులే పడుతున్నాయి. ఇక చిత్రం విడుదలయ్యాక ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.
విజేత చిత్రం విడుదల కాకముందే కళ్యాణ్ దేవ్ రెండవ చిత్రం గురించి చర్చ మొదలైపోయింది. లుక్స్ పరంగా కళ్యాణ్ దేవ్ అందరిని ఆకర్షించే విధంగా ఉన్నాడు. నటుడిగా ప్రూవ్ చేసుకుంటే అతడు హీరోగా స్థిరపడ్డట్లే అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
కళ్యాణ్ దేవ్ రెండవచిత్రానికి దర్శకుడు హరీష్ శంకర్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మెగా క్యాంప్ హరీష్ తో చర్చలు జరుపుతోందని త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.