After heavy rains in Mumbai on June 24-25, the situation is likely to get better with moderate predicted for today.
భారత వాణిజ్య నగరం ముంబైలో జూన్ 24, 25వ తేదీలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో నగరం అతలాకుతలం అయింది. రుతుపవనాల తాకిడి కారణంగా ఉత్తరాదిని వర్షాలు ముంచెత్తుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ముంబై నగరం జలమయమైంది.
నైరుతి రుతుపవనాలు ఈ నెల 28, 29వ తేదీలలో ఢిల్లీకి విస్తరించనున్నాయి. ఇప్పటికే ప్రి మాన్సూన్ ప్రభావం నార్త్ వెస్ట్ ఇండియాలో కనిపిస్తోంది. ఒడిశాలోని చాలా ప్రాంతాలతో పాటు వెస్ట్ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు, బీహార్‌లోని పలు ప్రాంతాలు, జార్ఖండ్, నార్త్ అరేబియన్ సముద్ర తీర ప్రాంతం, గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు, చత్తీస్‌గఢ్, ఒడిశాలోని పలు ప్రాంతాలు, జార్ఖండ్, బీహార్, ఉత్తర ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు, ఉత్తరాఖండ్, సౌత్ ఈస్ట్ రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో నైరుతి రుతు పవనాల ప్రభావంతో రానున్న 48 గంటల్లో వర్షాలు కురిసే అవకాశముంది. ఢిల్లీతో సహా నార్త్ వెస్ట్ ఇండియాలపై ఈ నెల 28, 29వ తేదీలలో నైరుతి రుతు పవనాల ప్రభావం కనిపిస్తుంది. ఢిల్లీలో మోస్తారు వర్షం కురిసే అవకాశముంది.