Arjun Tendulkar Trolled In Twitter For Bcci's Post for nepotism

2018-06-26 280

Arjun Tendulkar is son of legandary crickter Sachin Tendulkar has selected for India's Under19 team, Arjun spent's time with Team India head coach Ravi Shastri to get advices from Him.

ఇటీవలే భారత సెలక్టర్లు ప్రకటించిన అండర్-19 జట్టులో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో త్వరలో టీమిండియా అండర్-19 జట్టు తరఫున అర్జున్‌ శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నాడు. ఈ పర్యటనలో భాగంగా అర్జున్ టెండూల్కర్ ఆతిథ్య శ్రీలంక జట్టుతో రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఈ పర్యటనకు ముందు అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే ఇంగ్లాండ్‌ పర్యటన కోసం కోహ్లీ సేన లండన్‌‌కు బయల్దేరిన సంగతి తెలిసిందే.
ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న అర్జున్‌ టెండూల్కర్ సోమవారం టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రిని కలిశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. "యువ క్రికెటర్‌ అర్జున్‌ టెండూల్కర్‌కు విలువైన సలహాలు, సూచనలు ఇస్తోన్న రవిశాస్త్రి" అని బీసీసీఐ పేర్కొంది. అయితే ఈ పోస్టు పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. తన తండ్రి దిగ్గజ క్రికెట్ కావడంతోనే అర్జున్‌ను బీసీసీఐ బాగా ప్రమోట్ చేస్తోందని జోకులు వేస్తున్నారు.