Geetha Madhuri, Ganesh, Tejaswi Madivada, Bhanu Sree and Kireeti have been nominated for elimination from Bigg Boss Telugu 2 in its third week. Everyone is curious to know who will be evicted from the house.
బిగ్ బాస్ తెలుగు 2 విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి ప్రవేశించింది. తొలివారం సంజన అన్నె, రెండో వారం నూతన్ నాయుడు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసింతే. తాజాగా మూడోవారం ఎలిమినేషన్‌కు నామినేషన్లు పూర్తయ్యాయి.
వాస్తవంగా నామినేషన్లు అనేవి సీక్రెట్‌గా జరగాలి. అయితే అవి పూర్తయిన తర్వాత ఇంటి సభ్యులు అందుకు సంబంధించిన వివరాలు ఒకరితో ఒకరు చెప్పుకుంటుండటంతో బిగ్ బాస్ రూటు మార్చాడు. ఈ వారం అందరినీ లివింగ్ రూమ్‌లోనే కూర్చోబెట్టి ఓపెన్‌గా నామినేషన్ల ప్రక్రియ నిర్వహించారు.
ముందుగా ఇంటి కెప్టెన్ అమిత్‌ను స్టోర్ రూమ్‌కు పంపి అక్కడ ఉన్న ట్యాగ్స్ తెప్పించారు. ప్రతి ఒక్కరికి రెండు ట్యాగ్స్ చొప్పున ఇచ్చారు. ఎవరినైతే ఇంటి నుండి బయటకు పంపాలనుకుంటారో వారి మెడలో ఆ ట్యాగ్ వేయాలని కోరారు. అమిత్ కెప్టెన్ అయినందున నామినేషన్ ప్రక్రియ నుండి అతడికి మినహాయింపు ఇచ్చారు. అదే విధంగా నందిని వచ్చి కేవలం వారం రోజులు మాత్రమే అయినందున ఆమెకు కూడా ఈవారం నామినేషన్ల నుండి తప్పించారు.
Image Courtesy - Star India