A last-gasp winner from Salem Al Dawsari helped Saudi Arabia stun Egypt 2-1 in the final Group A encounter of the 2018 FIFA World Cup at Russia's Volgograd Arena.The match looked all set for an uninspiring draw when the Villarreal striker netted the winner for the Green Falcons with a cool right-footed volley past Egyptian custodian Essam Al Hadary, who created history by becoming the oldest player in World Cup .
ఫిఫా ప్రపంచకప్‌లో ఈజిప్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌదీ అరేబియా ఆఖరి వరకు పోరాడి గెలిచింది. మ్యాచ్ డ్రాగా ముగిసినట్లేనని అంతా భావించిన తరుణంలో, ఆఖరి క్షణాల్లో గోల్‌తో సౌదీ అరేబియా 2-1తో ఈజిప్ట్‌పై విజయం సాధించింది. ఆ జట్టు వెనుకబడి మరీ పుంజుకుంది. సౌదీ తరఫున అల్ ఫరాజ్ (45+6, పెనాల్టీ), సలేం అల్ దవ్‌సారి (90+5) గోల్స్ కొట్టగా.. ఈజిప్ట్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను మహ్మద్ సలా సాధించాడు.
ప్రపంచకప్ మ్యాచ్ ఆడిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించిన ఈజిప్ట్ గోల్‌కీపర్ ఎసామ్ హదరి ఓ పెనాల్టీని అద్భుతంగా అడ్డుకున్నాడు. కానీ మరోదాన్ని ఆపలేకపోయాడు. 45 ఏళ్ల హదరి 39వ నిమిషంలో సౌదీ అరేబియా ఆటగాడు పహాద్ అల్ మువాలాద్ స్పాట్ కిక్‌ను కుడివైపు దూకుతూ కళ్లుచెదిరే రీతిలో ఆపాడు. ఐతే సౌదీ రెండు అర్ధభాగాల్లోనూ స్టాపేజ్ సమయంలో గోల్స్ సాధించింది. ప్రథమార్థం ఇంజురీ సమయంలో సౌదీ అరేబియాకు లభించిన పెనాల్టీని ఫరాజ్ సద్వినియోగం చేసుకున్నాడు.