IPC Section Bharya Bandhu Movie Press Meet

2018-06-25 178

Rettadi Srinivas’s upcoming film ‘IPC Section Bharya Bandhu’ has finally released its official trailer. While the film stars Sarraschandra and Neha Deshpande in lead roles, actress Amani also stars in a crucial role. This movie is produced by Aluri Samba Siva Rao. This movie is set to release on June 29th.

నిర్మాత ఆలూరి సాంబశివరావు మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేసి, తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేసి.. స్థిరాస్తి రంగంలో ప్రవేశించి అందులో రాణించారు. నాలుగేళ్ల క్రితం ఆలూరి క్రియేషన్స్ బ్యానర్ పై 'చెంబు చినసత్యం' చిత్రంతో నిర్మాతగా ఆలూరి సాంబశివరావు మారారు. తాజాగా 'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు' చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నటి ఆమని ముఖ్య పాత్రలో.. శరత్ చంద్ర-నేహా దేశ్ పాండే హీరోహీరోయిన్స్ గా.. శ్రీనివాస్ రెట్టాడి దర్శకత్వంలో ఆలూరి క్రియేషన్స్ పతాకంపై రూపొందిన 'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు' ఈనెల (జూన్) 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని.. చిత్ర నిర్మాత, ఆలూరి క్రియేషన్స్ అధినేత ఆలూరి సాంబశివరావు మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. "నిర్మాతగా నా తొలి చిత్రం 'చెంబు చినసత్యం' నన్ను తీవ్రంగా నిరాశ పరిచింది. ఆర్ధికంగానూ నష్ట పరిచింది. ఆ సినిమా నేర్పిన పాఠాలతో ఇప్పుడు రెండు సినిమాలు నిర్మిస్తున్నాను. 'నేనే ముఖ్య మంత్రి' అనే సినిమా కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది.