Bigg Boss Season 2 Telugu : Nutan Naidu Eliminated

2018-06-25 104

Nutan Naidu has been eliminated from Bigg Boss Telugu 2. He is the second contestant to leave the house this season after Sanjana Anne, who was shown the door from the show last week.
#BiggBossTelugu2

నాని హోస్ట్‌గా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 2 విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకుంది. రెండో వారం ఇంటి నుండి నూతన్ నాయుడు ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ షోలో ఎప్పుడు ఏదైనా జరుగవచ్చు? అనే దానికి నూతన్ నాయుడు ప్రత్యక్ష ఉదామరణగా నిలిచాడు. గురువారం వరకు నూతన్ నాయుడు సేఫ్ జోన్లో ఉన్నప్పటికీ శుక్రవారం జరిగిన గొడవ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బటర్‌ఫ్లై ఎఫెక్ట్ మాదిరిగా ఎక్కడో జరిగిన ఒక చిన్న సంఘటన చివరకు నూతన్ నాయుడు ఇంటి నుండి బయటకు వెళ్లిపోయేలా చేసింది.
రెండు వారాలకే మీలో కాన్ఫిడెన్స్ పోతే బిగ్ బాస్ షోకు ఎందుకొచ్చారు? ఈ షోలో గెలవడం అనేది కేవలం ఇక్కడి నుండి ప్రైజ్ మనీ ఒక్కటే తీసుకెళ్లడం కాదు. ఒక రెస్పెక్ట్ ను ఇంటికి తీసుకెళతారు, ఒక హీరోగా ఇంటికెళతారు. మిమ్మల్ని మూడున్నర నెలల పాటు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ప్రతి రోజూ వారి ఇంట్లో చూస్తున్నారు. మీరు మాట్లాడే చిన్న మాటైనా? కాన్ఫిడెన్స్ లెవల్స్ అయినా, ఇంకేదైనా అవ్వొచ్చు. ఇది మళ్లీ మీకు తిరిగి ఎక్స్‌ప్లెయిన్ చేసే ఛాన్స్ రాదు. ఇది వన్ టైమ్ ఆఫర్. మీరు చేసే ప్రతి పని గురించి, ప్రతి మాట గురించి బయట మాట్లాడుకుంటున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి అని నాని సూచించారు.