బిగ్ బాస్ 2 తమిళ్ : లేడీ కంటెస్టెంట్స్ లిప్ కిస్సులపై అభ్యంతరాలు!

2018-06-25 3

తెలుగులో మాదిరిగానే... తమిళంలో కూడా ఇపుడు బిగ్ బాస్ సీజన్ 2 రన్ అవుతోంది. కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో మొదటి నుండి వివాదాలకు కేంద్ర బింధువుగా ఉంది. తాజాగా బిగ్ బాస్ ఇంట్లో జరిగిన లిప్ కిస్సుల వ్యవహారం సోషల్ మీడియాలో సంచలనం అయింది. అది కూడా ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ మధ్య జరుగడంతో బిగ్ బాస్ షోలో ఈ చండాలం ఏమిటీ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మసాలా పెంచి టీఆర్పీ రేటింగులు పెంచుకోవడమే లక్ష్యంగా ఈ రియాల్టీ షో సాగుతుందని అంటున్నారు.
బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు పూర్తి చేయడంలో భాగంగా పోటీ దారులు ఎలాంటి పనులు చేయడానికి కూడా వెనకాడటం లేదు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ గెలుపే ముఖ్యంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల తమిళ బిగ్ బాస్ 2లో జననీ అయ్యార్, ఐశ్వర్య దత్త లిప్ టు లిప్ ముద్దులు పెట్టుకుని సంచలనానికి తెరలేపారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల ప్రకారమే వాళ్లు ఈ చర్యకు పాల్పడటంతో చాలా మంది ఇలాంటి నీచమైన టాస్కులు ఇస్తున్న బిగ్ బాస్ మీద మండి పడుతున్నాయి. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు చెబుతున్న కొన్ని పనులు ప్రేక్షకులకు మంచి వినోదం పంచుతూ ఆనందం కలిగిస్తుండగా, కొన్ని టాస్కులు మాత్రం ఏవగింపుగా అనిపిస్తున్నాయి.

Videos similaires