కెటీఎమ్ ఆర్సీ 200 బ్ల్యాక్ కలర్ వేరియంట్ విడుదల

2018-06-25 1

స్పోర్ట్స్ మోటార్ సైకిళ్ల తయారీ దిగ్గజం ఆస్ట్రియాకు చెందిన కెటీఎమ్ నేడు విపణిలోకి కెటీఎమ్ ఆర్సీ 200 బైకును బ్ల్యాక్ వేరియంట్లో లాంచ్ చేసింది. ఆర్సీ 200 సూపర్ స్పోర్ట్ మోడల్ యొక్క ఆల్-న్యూ బ్ల్యాక్ కలర్ వేరియంట్ ఇది వరకు లభించే ఇతర వేరియంట్లకు కొనసాగింపుగా వచ్చింది.

సరికొత్త కెటీఎమ్ ఆర్సీ 200 ఆల్-న్యూ బ్ల్యాక్ కలర్ వేరియంట్ ధర రూ. 1.77 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. దీని విడుదలతో కెటీఎమ్ ఆర్సీ 200 ఇప్పుడు బ్లాక్ మరియు వెయిట్ కలర్ ఆప్షన్‌లో లభ్యమవుతోంది.

ఆర్సీ 390 బైకు తరహాలో ఉన్నటువంటి కలర్ స్కీమ్ ఆర్సీ 200 బ్ల్యాక్ వేరియంట్లో అందివ్వడం జరిగింది. అయితే, రెండింటి మధ్య తేడా ఉండేందుకు ఆరేంజ్ మరియు వైట్ కలర్ సొబగులు కాస్త భిన్నంగా ఇవ్వడం జరిగింది. కెటీఎమ్ ఆర్సీ 200 టెయిల్ సెక్షన్లో వైట్ గ్రాఫిక్స్ ఉన్నాయి.

Read more at: https://telugu.drivespark.com/two-wheelers/2018/ktm-rc-200-black-colour-variant-launched-india-at-rs-1-77-lakh-specifications-features-images/articlecontent-pf77762-012196.html

#KTM #KTMRC200 #KTMRC200Black

Free Traffic Exchange