Renu Desai engaged and Hiding her New Husband’s Identity. Renu Desai has revealed a multiple time that she is in search of a person who could share her life. Recently, she hinted that she found someone who could love her unconditionally and take of the kids.
పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సంకేతాలు ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తనకు మరొక తోడు దొరికిందని, ఇపుడు జీవితం చాలా సంతోషంగా ఉందంటూ ఆమె ఓ వ్యక్తి చేయిపట్టుకున్న ఫోటోను కొన్ని రోజుల క్రితం పోస్టు చేశారు. తాజాగా రేణు ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మరో ఆసక్తికర పోస్టు పెట్టారు. ఈ ఫోస్టు చేయడం ద్వారా తనకు ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని ఆమె అఫీషియల్‌గా ప్రకటించారు.
ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకున్న ఆ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతే కాదు ఈ ఫోటోకు ‘ఎంగేజ్డ్' అని క్యాప్షన్ పెట్టారు. దీని ద్వారా రేణు దేశాయ్ మరొక వ్యక్తితో జీవితం పంచుకుంటున్నారనే విషయం స్పష్టమౌతోంది.
తన జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి గురించిగానీ, అతడి పేరుగానీ రేణు దేశాయ్ వెల్లడించలేదు. అయితే అతడు కూడా భార్యతో విడాకులు అయిన వ్యక్తే అని తెలుస్తోంది. ఈ ఫోటోలో ఉన్న మరో పాప అతడి కూతురుగా భావిస్తున్నారు. రేణు దేశాయ్ కూడా ఇందుకు సంబంధించి కొన్ని హింట్స్ ఇచ్చారు.
అయితే రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవడం చాలా మంది అభిమానులకు ఇష్టం లేదు. ‘మీరు రెండో పెళ్లి చేసుకుంటే గొడవలు అవుతాయ్. నా దేవుడికి ఎలాంటి సమస్యలు రాకూడదు. కాబట్టి ఏం చేసినా ఆలోచించి చేయండి.' ఓ వ్యక్తి వ్యాఖ్యానించగా..... దీనికి రేణు దేశాయ్ స్పందిస్తూ..‘క్రేజీ' అంటూ రిప్లై ఇచ్చారు.