Renu Desai gives clarity on Akira with Pawan in Vijayawada. Akira spending time with his father because of holidays
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కొత్త వివాహ జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పవన్ నుంచి విడిపోయాక రేణు దేశాయ్ తన పిల్లలు అకిరా, ఆద్యతో పుణేలో ఉంటున్నారు. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. ప్రస్తుతం పవన్, రేణు తనయుడు అకిరా పేరు కూడా సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ప్రస్తుతం అకిరా పవన్ తో ఉండడంపై వస్తున్న ఊహాగానాలకు రేణు స్పందించింది.
పవన్ కళ్యాణ్ ఫాన్స్ అకిరాని జూనియర్ పవర్ స్టార్ అని పిలవడం ప్రారంభించేశారు. దీనిపై కూడా ఇటీవల రేణుదేశాయ్ స్పందించింది. అకిరాని ఎవరూ జూనియర్ పవర్ స్టార్ అని పిలవద్దని అలా చేస్తే వారిని బ్లాక్ చేస్తా అంటూ కూడా రేణు దేశాయ్ హెచ్చరించింది. అలా పిలవడం పవన్ తో పాటు తనకు, అకీరాకు కూడా ఇష్టం లేదని తెలిపింది.
రేణు దేశాయ్ ఇటీవల సోషల్ మీడియాలో రేండు చేతులు కలసి ఉన్న పిక్ ని పోస్ట్ చేసి ఈ చేయిని ఎప్పటికి విడువకు అంటూ కామెంట్ పెట్టింది. దీనితో రేణుదేశాయ్ త్వరలో పెళ్ళికి సిద్ధం అవుతోంది అంటూ ప్రచారం మొదలైంది.
శుక్రవారం పవన్ కళ్యాణ్ విజయవాడలో పర్యటించారు. సతీసమేతంగా పవన్ పటమటలో అద్దెకు తీసుకున్న నూతన గృహంలోకి గృహప్రవేశం చేసారు. పవన్ తో పాటు అకిరా కూడా విజయవాడకు వెల్ళడం అందరి దృష్టిని ఆకర్షించింది.