Sammohanam movie first week box office collections. highest first week for Sudheer
సుధీర్ బాబు, అదితి రావు హైదరి జంటగా నటించిన సమ్మోహనం చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మరోమారు సున్నితమైన కథతో ప్రేక్షకులని మెప్పించాడు. మంచి హాస్యం, ఆకట్టుకునే రొమాంటిక్ ప్రేమ కథా చిత్రంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సమ్మోహనం చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద మరే చిత్రం ఆశించిన స్థాయిలో రాణించకపోవడం కూడా సమ్మోహనం చిత్రానికి కలసి వచ్చే అంశం అని చెప్పొచ్చు.
సమ్మోహనం చిత్రం తొలి వారం ముగిసేసరికి 4.90 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. సుధీర్ తొలివారం రికార్డ్స్ పరిశీలిస్తే సమ్మోహనం చిత్రం అత్యధికం అని ట్రేడ్ పండితులు అంటున్నారు.
సమ్మోహనం చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ కమర్షియల్ హిట్ గా నిలవాలంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ జోరు సరిపోదని అంటున్నారు. తొలివారంముగిసిపోయింది. ఇకరాబట్టవలసిన మొత్తం భారీగానే ఉంది. తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా కలిపి ఈ చిత్ర థియేట్రికల్ హక్కులు 6 కోట్లవరకు అమ్ముడయ్యాయి. ఇప్పటి వరకు 55 శాతం షేర్ మాత్రమే రికవరీ అయినట్లు తెలుస్తోంది.