Team India Won Champions Trophy On Same Day

2018-06-23 136

Keeping the 2019 Cricket World Cup in mind, the selectors preferred the 31-year-old Raina, a seasoned campaigner of 223 ODIs with 5568 runs under his belt, over an in-form Rishabh Pant due to his vast experience.

సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజున టీమిండియా ఛాంపియన్స్‌ ట్రోఫీని ముద్దాడింది. ఈరోజుతో ఆ మధుర క్షణాలకు ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఐసీసీ ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. 2013లో జరిగిన ఈ మెగా టోర్నీని ఇంగ్లాండ్‌, వేల్స్‌ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి.
ఈ టోర్నీలో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై ధోని నేతృత్వంలోని టీమిండియా ఐదు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మెగా టోర్నీని ఆ ఒక్కసారి మాత్రమే టీ20 ఫార్మట్‌లో నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది.
అనంతరం 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ దూకుడుగా ఆడింది. ఒకానొక సమయం ఈ లక్షాన్ని చేధించేలా కనిపించింది. చివర్లో ఇంగ్లాండ్ విజయానికి 20 బంతుల్లో 22 పరుగులు చేయాలి, చేతిలో ఆరు వికెట్లు ఉండటంతో ఈ మ్యాచ్‌‌లో ఇంగ్లాండ్ విజయం సాధిస్తుందని అంతా భావించారు.
ఇలాంటి సమయంలో ఇషాంత్‌ శర్మ వరుస బంతుల్లో రెండు కీలక వికెట్లు తీయడంతో ఆతిథ్య జట్టు కష్టాల్లో పడింది. చివర్లో ధోని, బౌలర్ల కట్టదిట్టమైన బౌలింగ్‌తో ఒత్తిడికి గురైన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 124 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా రెండోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలచుకుంది.