కిమ్ పై ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

2018-06-23 1


సింగపూర్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌లో చారిత్రాత్మక భేటీ తర్వాత... ఉత్తరకొరియా తమ అణ్వాయుధాలతో పాటు, అణుపరీక్షలు కూడా పూర్తిగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కిమ్ జాంగ్ ఉన్ స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ... అమెరికా అధ్యక్షుడు మాత్రం మరో ఏడాదిపాటు ఉత్తరకొరియాపై ఆంక్షలు కొనసాగుతాయని సంచలన ప్రకటన చేశారు. జూన్ 12న జరిగిన చారిత్రాత్మక భేటీలో పూర్తిస్థాయిలో అణ్వాయుధాలుచ వాటి తయారీ కేంద్రాలను ధ్వంసం చేస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో కొరియా ద్వీపంలో అమెరికా మిలటరీ విన్యాసాలను కూడా నిలిపివేస్తామని ట్రంప్ చెప్పారు. అయితే ఇప్పుడు ట్రంప్ యూటర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్ అమెరికా కాంగ్రెస్‌కు లేఖ రాశారు.
అణ్వాయుధాల వినియోగంపై కిమ్ స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ... అది పూర్తిగా నమ్మలేమని అన్నారు. ఇది భవిష్యత్తులో ప్రమాదంగా మారే అవకాశం ఉండటంతోనే మరో ఏడాది పాటు ఉత్తరకొరియాపై ఆంక్షలు కొనసాగించేందుకే నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచదేశాలకు ఉత్తరకొరియా నుంచి ఇకపై ఎలాంటి ముప్పు ఉండదని ట్రంప్ వ్యాఖ్యానించిన కొన్ని రోజులకే మళ్లీ యూటర్న్ తీసుకోవడం కాస్త ఆసక్తికరంగా మారింది. సింగపూర్ నుంచి అమెరికాలో దిగిన ట్రంప్ వెంటనే ఓ ట్వీట్ చేశారు.

Videos similaires