శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం హైదరాబాద్ నగరంలో బీభత్సం సృష్టించింది. అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. రోడ్ల మీద మోకాలు లోతులో నీళ్లు చేరడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అర్థరాత్రి భారీ వర్షం పాతం(3 సెం.మీ) నమోదైంది.
అర్ధరాత్రి కురిసిన వర్షం ఓ యువకుడి ప్రాణం తీసింది. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి కూకట్‌పల్లిలోని జయనగర్‌లో ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి భారీగా వరదనీరు చేరుకుంది. సెల్లార్‌లో పార్కింగ్ చేసిన కారులో నిద్రించిన గోపీ అనే యువకుడు వరదనీరు రావడంతో అందులోనే మృతి చెందాడు.