The ICC had introduced two new balls from two ends it’s playing rules back .
వన్డేల్లో రెండు కొత్త బంతులను ఉపయోగించడాన్ని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తప్పుబట్టాడు. వన్డే క్రికెట్‌ను నాశనం చేయడానికి ఈ రెండు బంతుల కాన్సెప్ట్ తన వంతు పాత్ర పోషిస్తున్నదని సచిన్ ట్వీట్ చేశాడు. ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ 481 పరుగులతో ప్రపంచ రికార్డు నెలకొల్సిన నేపథ్యంలో సచిన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
'వన్డే మ్యాచ్‌లో రెండు కొత్త బంతులు వాడటం అనేది వినాశనానికి అత్యుత్తమమైన విధానం. రివర్స్ స్వింగ్‌కు అనుకూలించేలా బంతి పాతబడటానికి సమయం ఉండదు. రెండు కొత్త బంతుల విధానం వల్లరివర్స్ స్వింగ్‌ను చూసే అవకాశం ఉండదు' అని సచిన్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
సచిన్ అభిప్రాయాలతో పాకిస్థాన్ లెజెండరీ పేస్ బౌలర్ వకార్ యూనిస్ ఏకీభవించాడు. నిజానికి ఈ రెండు బంతుల నిబంధన వల్లే రివర్స్ స్వింగ్ వన్డేల నుంచి దాదాపు మాయమైపోయిందని వకార్ ట్వీట్ చేశాడు. "ఈ కారణంతోనే ఎక్కువ మంది అటాకింగ్ ఫాస్ట్ బౌలర్లను తయారు చేయలేకపోతున్నాం. రెండు కొత్త బంతులు వాడటం వల్ల బౌలర్లు ఆత్మరక్షణలో పడిపోతున్నారు. లైనప్ మారుస్తున్నారు. నీతో పూర్తిగా ఏకీభవిస్తున్నా సచిన్" అంటూ ట్వీట్ చేశాడు.