Fifa World Cup 2018 : Australia-Denmark Match Was Draw

2018-06-22 193

Mile Jedinak's second penalty of the World Cup earned Australia a precious 1-1 draw against Denmark after a controversial VAR decision led to Christian Eriksen's superb opener being cancelled out in Samara.

ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్-సీలో గురువారం డెన్మార్క్.. ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరు.. డ్రా ముగిసింది. మ్యాచ్ సమయం ముగిసేవరకు పోరాడిన ఇరు జట్లు ఆఖరికి 1-1తో డ్రాగా ముగించాయి. ఫిఫా ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో ఉన్న డెన్మార్క్‌కు.. 40వ ర్యాంకులో ఉన్న ఆస్ట్రేలియా గట్టిపోటీనిచ్చింది.
డార్క్‌హార్స్‌గా బరిలో దిగిన డెన్మార్క్ మ్యాచ్ ఆరంభమైన ఏడో నిమిషంలోనే తొలి గోల్ కొట్టి అబ్బురపరిచింది. డెన్మార్క్‌ మిడ్‌ఫీల్డర్‌ ఎరిక్‌సన్‌ 7వ నిమిషంలో గోల్‌ చేసి ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాతి నుంచి ఇరు జట్లు బంతిని నియంత్రణలో ఉంచుకోవడానికి తీవ్రంగా పోటీపడ్డాయి.
కాగా ఈ క్రమంలో 37వ నిమిషంలో వార్‌ రూపంలో ఆస్ట్రేలియాకు పెనాల్టీ లభించింది. దీంతో 38వ నిమిషంలో ఆసీస్‌ ఆటగాడు జెడ్నిక్‌ పెనాల్టీని గోల్‌గా మలిచి స్కోరును 1-1కి సమం చేశాడు.
తొలి అర్ధ భాగంలో ఇరు జట్లు చెరో గోల్ చేసి ఆకట్టుకున్నాయి. రెండో సెషన్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఫలితంలో ఎలాంటి మార్పు రాలేదు. రెండు జట్లు పూర్తిగా రక్షణాత్మక ఆటతీరుతో వ్యవహరించడంతో రెండో అర్ధభాగం గోల్స్ లేకుండానే 0-0తో ముగిసింది. 74వ నిమిషంలో ఆస్ట్రేలియా ఆటగాడు భుజం గాయం కారణంగా మైదానాన్ని వీడాడు.