Madhavi Latha about Bigg Boss2.
తెలుగు చిత్ర పరిశ్రమలో రోజుకో కొత్త వ్యవహారం బయటపడుతోంది. కాస్టింగ్ కౌచ్ పై తొలిసారి గళం విప్పిన మాధవీలత, బిగ్ బాస్ గురించి కూడా సంచలన విషయాలు వెల్లడించింది. కాస్టింగ్ కౌచ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎంపికలో కూడా జరిగిందని మాధవీలత ఆరోపిస్తోంది. తాను బిగ్ బాస్ విషయంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని మాధవీలత బయట పెట్టింది. మాధవీలత వ్యాఖ్యలతో బిగ్ బాస్ 2 పై మరింతగా నెగిటివ్ ప్రచారం ఎక్కువయ్యే అవకాశం ఉంది
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సెలక్షన్ కమిటీలో కీలక వ్యక్తి తనకు ఫోన్ చేశాడని మాధవీలత తెలిపింది. అతడు ఫోన్ చేసి బిగ్ బాస్ లో అవకాశం ఉందని చెప్పాడు. మీకు ఒకే అయితే మనం ఎంజాయ్ చేద్దాం అని అడిగేసినట్లు మాధవీలత తెలిపింది. అతడి ఉద్దేశం తెలియడంతో తాను బిగ్ బాస్ కు వెళ్లలేదని మాధవీలత తెలిపింది.
అతడు ఫోన్ చేసి దాదాపు 20 నిమిషాలు మాట్లాడాడని మాధవీలత తెలిపింది. ఈ సారి బిగ్ బాస్ లో మంచి మసాలా యాడ్ చేస్తున్నాం. ఇష్టమైతే ఎక్స్ ఫోజింగ్ చేసేలా దుస్తులు వేసుకోవచ్చు అని ఫోన్ లో చెప్పాడు.