చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపిన కొల్లు రవీంద్ర

2018-06-21 5

Andhra Pradesh Minister Kollu Ravindra meets Congress leader and Former Rajya Sabha Member Chiranjeevi and thanks for MP lads funds for Machilipatnam development.
#Chiranjeevi
#KolluRavindra

ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత కొల్లు రవీంద్ర కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు చిరంజీవికి గురువారం కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాదులోని ఆయన నివాసానికి వచ్చి మరీ థ్యాంక్స్ చెప్పారు. అభివృద్ధి పనుల విషయంలో ఆయన చేసిన పనికి గాను ప్రశంసించేందుకు మెగాస్టార్ ఇంటికి వచ్చారు.
చిరంజీవి 2012 నుంచి ఇటీవలి వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పని చేశారు. చిరంజీవి తన ఎంపీ ల్యాడ్స్ ద్వారా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు అందించారు. రూ.5 కోట్ల నిధులతో ఈ పనులు చేపట్టారు.
ఆ పనులు సమర్థవంతంగా జరుగుతున్నాయని చెబుతూ కొల్లు రవీంద్ర... మెగాస్టార్‌ను కలిశారు. పనులు వేగంగా జరుగుతున్నాయని, మరో ఏడాదిలోగా మిగిలిన పనులను పూర్తి చేస్తామని ఈ సందర్భంగా కొల్లు.. చిరంజీవికి తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలు చిరంజీవికి రుణపడి ఉంటారని చెప్పారు. చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన సహకారంతో చేస్తున్న అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయని కొల్లు చెప్పారు. చిరంజీవి అడగ్గానే సహాయం చేశారన్నారు. అవకాశం ఉంటే అభివృద్ధి పనులను చిరంజీవి చేతుల మీదుగానే ప్రారంభించేలా చూస్తామన్నారు.

Videos similaires